అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరపాలి – మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా అంజయ్య విజ్ఞప్తి .

అంబేద్కర రాజ్యాం ఆమోద దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా.అంజయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం తాళ్లూరులోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో దారా మాట్లాడుతూ …… 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ కు రాజ్యాంగ ప్రతిని అందజేశారన్నారు. ఏళ్ల తరబడి విదేశీ పాలనలో ఉన్న భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం అవసరమైందన్నారు విభిన్న ప్రాంతాలు కులాలు, మతాలు భాషలు సంస్కృతులు ఉన్న భారతదేశానికి అనువైన రాజ్యాంగం రాయటానికి అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేశారన్నారు . అంబేద్కర్ ప్రపంచ దేశాలలోని రాజ్యాంగాలను పరిశోధించి వివిధ దేశాలలోని ఉత్తమమైన అంశాలను భారతదేశానికి అనుకూలమైన చట్టాలను సంగ్రహించి భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారన్నారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు లలో భారత రాజ్యాంగాన్ని గ్రంథత్వం చేసి భారతదేశ ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని అందించారన్నారు . ఈ అంబేద్కర్ రాజ్యాంగమే నేటికీ అమలులో ఉందన్నారు 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించిన అంబేద్కర్ రాజ్యాంగం సరిగ్గా రెండు నెలల తర్వాత 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినాన్ని రిపబ్లిక్ డే గా దేశమంతా జరుపుకుంటున్నారు కానీ అంబేద్కర్ రాజ్యాంగ అమల దినోత్సవం నవంబర్ 26 ను అగ్రకుల మనువాద ప్రభుత్వాలు విస్మరించాయన్నారు. రిపబ్లిక్ డే రోజు కూడా అంబేద్కర్ ఫోటో లేకుండా అంబేద్కర్ పేరు చెప్పకుండా భరతమాత ఫోటోతో దేశ ప్రధాని నుండి పంచాయతీ సర్పంచుల వరకు జెండాలు ఎగరవేస్తున్నారన్నారు. అంబేద్కర్ను స్మరించకుండా భారత దేశ రాష్ట్రపతి నుండి గ్రామస్థాయి వరకు కుట్ర జరిగిందన్నారు. దళిత సంఘాల ఆందోళనలతో 2017 వ సంవత్సరం నుండి అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా జరుపుతూ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చిన కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాలలోని కొన్ని జిల్లాలలో అధికారులు అంబేద్కర్ పట్ల అంటరానితనం పాటిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్నారు. కావున ఈనెల 26వ తేదీన అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అధికార పూర్వకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని మరియు స్వచ్ఛందంగా జరపాలని దళిత సంఘాలకు అంబేద్కర్ వాదులకు దారా అంజయ్య విజ్ఞప్తి చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *