దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందించి చేయూత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బుధవారం దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేసారు. కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షుడు వెన్న పూస వెంకటరెడ్డి( మహేష్), ఎంపీపీ సుధాఅచ్చయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ షకీలా అమీనాబాషా, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరె క్టర్ కుమ్మిత అంజిరెడ్డి, రెడ్డి సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, వైఎ స్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కట్టెకోట హరీష్, నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు, కౌన్సిల ర్లు మేడం మోహన్ రెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచ్ వెన్నపూస శేషిరెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, లక్ష్మణరావు పాల్గొన్నారు.
