కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల దీర్ఘకాలికసమస్యలను పరి ష్కరించాలని మండల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోషియోషన్ అధ్యక్షులు శ్రీనివా సరావు కోరారు. డాక్టర్ వైఎస్సాఆర్ హెల్త్ క్లీనిక్ లో పని చేస్తున్న కమ్యూ నిటీ హెల్త్ ఆఫీసర్ల అసోషియోషన్ రాష్ట్రకమిటీపిలుపుమేరకు తాళ్లూరు పిహెచ్సీ వైద్యురాలు షేక్ ఖాదర్ మస్తాన్ బి కి మెమొరాండాన్ని బుధవారం సమర్పించారు. వార్షిక ఇంక్రి మెంట్లు అమలు చేయాలని, ప్రతినెల1వ తేదీ జీతాలు చెల్లించాలని, 10 నెలలుగా పెండింగ్లో వున్న వేతన బకాయిలను విడుదల చేయాలని,హెల్త్ ఇన్యూ రెన్సు పాలసీ అమలు వేగవంతం చేయాలని, జాబ్ చార్ట్ అమలుపై మార్గదర్శకాలు విడుదల చేయాలని, క్యాజువల్ సెలవులను పురనరుద్దరించాలని, 5 ఏళ్లుగా పెండిం గ్లో లోవున్న వేతనసవరణ అమలు చేయాలని, సర్వీస్ రెగ్యులైజ్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర కమిటి పిలువు మేరకుదశల వారి తమ ఆందోళనలు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మం డల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల అసోషియోషన్అధ్యక్షులు వి.శ్రీనివాసరావు, సభ్యు లుఎస్.చంద్రశేఖర్, ఎస్కేషపీ,వి. కార్తిక్, వైఝాన్సీరాణి, జె. మంగాబాయ్, ఎస్కే ఫాతిమా తదితరులు ఉన్నారు.
