రామజన్మభూమి తీర్థ క్షేత్రం నుండి జిల్లా కేంద్రమైన ఒంగోలు చేరుకున్న పవిత్ర అక్షతలు బుధవారం తాళ్లూరు చేరుకున్నాయి. అ యోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్బంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో రామజన్మభూమి తీర్థ క్షేత్రంలో పండిన అక్షతలను దేశ వ్యాపంగా పంపిణీ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించే బాగంగా తాళ్లూరుకు చేరుకున్నాయి. ఆర్ఎస్ఎస్ సభ్యుడు, బీజేపీనేత చందోలు రామారావు ఒంగోలునుండి 5కేజీల పవిత్ర అక్షతలను తాళ్లూరుకు తీసుక వచ్చి గ్రామవీధుల్లో జైశ్రీరామ్, భారత్మాతాకీ జై అన్న నినాధా లతో, సన్నాయి మేళతాళాలతో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంకు తరలించి భద్ర పరిచారు. ఈకార్యక్రమంలో చందోలు శివరామకృష్ణ, సాంబిరెడ్డి, వూటుకూరి శ్రీనివాసరావు వాసవీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
