ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ కి ఓటు ఇవ్వాలని
సనత్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ కోరారు.గురువారం బన్సిలాల్ పెట్ డివిజన్లోని సీసీ నగర్, న్యూ బోయగూడా లో ఆమె ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ఆశ్వీరాదం తీసుకోవడానికి మీ వద్దకు వచ్చానన్నారు.ఈ ఎన్నికలు ధర్మానికి.అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలనీ. బిఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు,నియామకాలు, ఎమి చేయలేదన్నారు.తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి అనుకుంటే దుర్భరం గా మారాయని.ప్రజలు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ప్రజలందరి బతుకులు బాగుపడుతాయని. బస్తిలు అన్ని ఇందిరమ్మ ఇళ్ళతో కళకళలాడుతాయని అని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
.


