రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి – దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు

భారత రాజ్యాంగం ఉదాత్తమైనది మరియు అత్యున్నత విలువలతో కూడినది. ప్రజలు కుల, మత, భాష, లింగ, ప్రాంత, జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అందరూ సమానమని రాజ్యాంగం పునరుద్ధానటించిందనీ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు తెలియజేశారు. గురువారం తాళ్లూరు మండల తహసిల్దార్ కి నవంబర్ 26వ తేదీన బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన లిఖిత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాహ్తత్వం, సమన్యాయం, సమాన అవకాశాలు, లౌకివాదం, సమగ్రత మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా రాజ్యాంగాన్ని ఆచరించేలా రూపొందించారని, ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఏరియా కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకట్రావు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *