తాళ్లూరులోని వీకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు దాత ఊటుకూరి రామకోటేశ్వర రావు, ఉమా అన్నపూర్ణ లు రూ.25 వేల విలువైన ప్రింటర్ కమ్ జెరాక్సు యంత్రాన్ని అందజేశారు. దాత ఊటుకూరి రామకోటేశ్వర రావు, ఉమా అన్నపూర్ణ దంపతులు ఈ యంత్రం తీసుకొచ్చి ఇన్ ఛార్జి ప్రధానోపాధ్యాయుడు శేషగిరికి గురువారం అందజేశారు. భవిష్యత్తులోనూ పాఠశాలకు అవసరమైన తోడ్పాటు అందిస్తా మని దాతలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు యూవీ. శ్రీనివాసరావు, ప్రభుదాసు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
