ఈ నెల 30 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని పార్టీ తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘ్ (టి.పి.వై.యస్.) రాష్ట్ర కమిటి ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో స్వాగతిస్తున్నారు. గురువారం బేగంపేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్టీ కార్పొరేషన్లో ఎరుకల కులస్తులకు చాలా అన్యాయం జరిగిందని ఎన్నో రోజుల నుండి తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘ్ (టి.పి.వై.యస్.) ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుండి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. ఎరుకల కులస్తులను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎరుకల కార్పొరేష్ ఏర్పాటు చేస్తామని ప్రకటించినందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎమ్మెల్యే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘ్ (టి.పి.వై.యస్.) రాష్ట్ర అధ్యక్షులు కెంబసారం కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరాకుల కృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ, యెరుకల సంఘ్ కులస్తుల తరుపున అందరి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని కాంగ్రెస్ పార్టీని ఎరుకల సమాజం గుర్తిస్తుందన్నారు.
