తెలంగాణలో రాజకీయాలు కేవలం ఒక కుటుంబానికే పరిమితం అయిందని …. అలా కాకుండా బిజెపి పార్టీ దేశ ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తుందని….. ప్రస్తుతం ఉన్న కారు బేకర్ అని … కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తెలంగాణకు విచ్చే సిన రాజ్ నాథ్ సింగ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని గాయత్రి గార్డెన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ …. ప్రపంచంలో భారతదేశానికి ఎనలేని పేరు కీర్తి ప్రతిష్టలు కేవలo ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి సాధ్యమైందని ఆయన అన్నారు. ఇంతకుముందు ప్రజా అవసరాల వస్తువు లతోపాటు రక్షణ శాఖ అవసరాలకు చెందిన అవసరాలకు దిగుమతులు చేసుకునే వారమని ఇప్పుడు మన దేశం నుండి ఇతర దేశాలకు ఎగురుమతి చేయటం విశేషమని ఆయన అన్నారు. తెలంగాణలో కేవలం కుటుంబం మాత్రానికే పాలన పరిమితమైందని దానివల్ల ప్రయోజనం లేదని అభివృద్ధి గాని ప్రయాసంక్షేమం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం దిశలో కొనసాగాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలోనూ తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందని … అభివృద్ధి కేవలం బిజెపి తోటే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో, మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ గౌడ్ , నామినేటెడ్ నెంబర్ రామకృష్ణ, ex వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్, భానుక నర్మదా మల్లికార్జున్, బి ఎన్ శ్రీనివాస్, పరుశురాం తదితరులు పాల్గొన్నారు.


