బీజేపీ యస్సి మోర్చా ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీ

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవ దగ్గుపాటి పురందేశ్వరి గారి ఆదేశాల మేరకు బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి శివారెడ్డి గారు పిలుపుమేరకు ఎస్సీ మోర్చా ప్రకాశం జిల్లా అధ్యక్షులు పెరిక లక్ష్మణ్ అధ్యక్షతన బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఒంగోలు పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది అదేవిధంగా భారత దేశ ప్రధాని గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పెరిక లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో దళితులపై గడిచిన నాలుగు సంవత్సరాలలో వేల సంఖ్యలో హత్యలు అత్యాచారాలు జరుగుతున్న దళిత ఎమ్మెల్యేలు దళిత మంత్రులు శోద్యం చూస్తూ ఉండడం హేయమైన చర్యగా పేర్కొన్నారు కార్పొరేషన్ నిధులు 3000 కోట్లు దారి మళ్లించి దళితులు ఎస్సీ కార్పొరేషన్ ఉన్నటువంటి 27 పథకాలను తీసేసి దళితుల పొట్ట కొట్టినటువంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అధిక మెజార్టీతో ఓట్లు వేసి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుందని అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు నేరుగా మనమే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో ముఖ్య అతిధులు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ గారు మరియు ప్రకాశం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి శివారెడ్డి గారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *