ఓ హోటల్లో బిర్యానీ ని తీసుకుని సేదతీరుదామని అనుకున్నాడు ఒ వ్యక్తి. మంచి పేరు ఉన్న హోటల్కి వెళ్లి ప్యాకెట్ బిర్యాని ఆర్డర్ చేసాడు. బిర్యాని అందుకున్న వెళ్లి తెరచి చూసి ఆవ్యక్తి అవాక్కయ్యాడు. చెడిపోయి వాసన వస్తున్న బియ్యానిని చూసి షాక్కు గురైనాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని బేగం పేటలో జరిగినది. బేగం పేటకు చెందిన విజయకమారన్ (సెల్నంబర్ 80084344109) అను వ్యక్తి ప్యారడైడ్ హోట్లో శుక్రవారం రాత్రి 8.32కు బిర్యాని తీసుకోగా అది చెడిపోయినది. సంబంధిత సిబ్బందికి విషయం తెలుపగా వారు కస్టమర్కు సమాధానం సక్రమంగా చెప్పక పోగా రూడీగా వ్యవహరించినట్లు కస్టమర్ ఆరోపణ. దీంతో కస్టమర్ బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఫుడ్ తనిఖీ విభాగం వారికి, మీడియాకి కూడ ఈ విషయమై కస్టమర్ తెలిపి ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. బాధితుడు బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అయినట్లు సమాచారం.


