బిజేవైయం రాష్ట్ర అధ్యక్షులు మిట్టావంశి కృష్ణ అరెస్ట్ ఆక్షేపణీయమని బిజేవైయం జిల్లా అధ్యక్షులు పువ్వాడి దామోదర్ పేర్కొన్నారు. అనంతపురంలో హిందువుల నరహంతకుడు టిప్పూ సుల్తాన్ విగ్రహం ఏర్పాటును భారతీయ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ కృష్ణ అడ్డుకోవటం తో పోలీస్ వారు అన్యాయం గా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారని పువ్వాడి దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ ఎవరు అనే విషయాన్ని కాస్త లోతుగా వివరిస్తూ…
టిప్పు సుల్తాన్ అసలు భారతీయుడే కాదని వారి నాన్న హైదర్ ఆలీ పొట్ట చేత పట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చి వలస జీవితాన్ని భారతదేశంలో కొనసాగించారని హిందూ రాజుల దగ్గర సైన్యంలో పనిచేసేవాడని, కాలక్రమంలో బ్రిటీష్ వారితో జరిగిన యుద్దంలో విజయం సాధించి మైసూర్ కు రాజైనాడని, వారి అంతర్గత భావమంతా దేశంలోని హిందూ రాజలని చంపి వారి రాజ్యాలను ఆక్రమించాలని తమ రాజ్యాన్ని విస్తరింప చేసుకోవాలని చూశారు హిందువులందరినీ ఇస్లాం లోకి మారిపోవాలని హుకుంజారి చేశారని తెలిపారు. కనిపించిన హిందూ కుటుంబాలను నరకయాతనకు గురి చేసేవాడు. హిందువులకు బలవంతంగా గొడ్డు మాంసం తినిపించేవాడు. హిందూ దేవాలయాలను కూల్చేసి వాటి సంపద మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. కొన్ని దేవాలయాలను కూలదోసి వాటిని మసీదులుగా మార్చాడు. మైసూర్ లో నివసించిన ఎందరో హిందువులు తమ ధర్మాన్ని, మాన ప్రాణాలను కాపాడుకోవడానికి మైసూర్ నుండి వలసపోయారు. ఇప్పటికీ మెల్కొటే ప్రాంతంలో దీపావళి పండుగను కూడా జరుపుకోవాలని హిందువులను వందలాది మందిని దీపావళి రోజున చంపించిన దుర్మార్గుడు టిప్పుసుల్తానని తెలిపారు.
టిప్పు సుల్తాన్ ఎం చేశారని ఆలయాల విధ్వంసాలు, హిందువుల మీద జిహాద్ దాడులు మల బార్ లొ ఉన్న ధనికులు, బ్రాహ్మణులు టిప్పు సుల్తాన్ అరాచకాలకు బైపడి కట్టు ట్టలతో ప్రాణాలు చేత పట్టుకొని పారిపోయినందుకా విగ్రహం ఏర్పాటు చేస్తారని ప్రశ్నించిన బిజేవైయం జిల్లా అధ్యక్షుడు పువ్వాడి దామోదర్. మా యువమోర్చా రాష్త్ర అధ్యక్షులు మిట్ట వంశీని విడుదల చేయకపోతే బిజేవైయం అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని పువ్వాడి దామోదర్ నేడు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
