బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు కర్నూల్లో జరిగిన 67వ రాష్ట్ర స్థాయి స్కూల్ గెమ్స్ పోటీలలో పలు పోటీలలో గెలుపొంది ప్రతిభ చాటారు. రగ్బీ ఆటలో అండర్ -14 బాలికల విభాగంలో తులసీ హర్షిణి (తృతీయ స్థానం), అండర్ -17లో బాలుర విభాగంలో డి బ్రహ్మ తేజ (తృతీయ స్థానం), బాలికల విభాగంలో హేమలత (తృతీయ స్థానం) నిలచారు. అండర్ -19 బాలుర విభాగంలో 10వ తరగతి విద్యార్థి జి కుమార్ శివరామ క్రిష్ణ పుణేలో జరుగు జాతీయ స్థాయి జట్టుకు స్టాండ్ బై గా ఎంపికయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్ రవి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను శనివారం పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ సురేష్, ఉపాధ్యాయులు ఎస్ఏలు వెంకటేశ్వర్లు, ఎన్ రవి, ఎం ధనలక్ష్మి, షేక్ అబ్దుల్ కరీమ్, జె లలిత, పి ఆంజనేయులు, స్వరూప రాణి, ఉషా రాణి, పీఈఓ రవి ప్రసాద్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. అదే విధంగా రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహిత ఎస్ అంజి రెడ్డి, రిటరైర్డు బ్యాంకు ఉద్యోగి ఎస్ యోగి రెడ్డి, పీసీ చైర్మన్ యు క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
