ఉపాధి పనులు సద్వినియోగం చేసుకోండి – ఎంపీడీఓ కె .యుగ కీర్తి

తాళ్లూరుమండలంలోని బెల్లంకొండవారిపాలెంలోసర్పంచ్ పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి
అధ్యక్షతన ఉపాధి హామీ పనుల గుర్తింపుపై గ్రామ సభను శనివారం నిర్వహించారు. ఈ
సందర్భంగా గ్రామంలో ఉపాధి వనరులను చిత్రాలతో నమూనా ముగ్గు పోసి ఉపాధి పనుల ప్రయోజనాలను గ్రామీణులకు అవగాహన కల్పించారు.ఎంపీడీఓ కె.యుగ కీర్తి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఉపయోగకరమైనపనులను గుర్తించినట్లు తెలిపారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2024-25ఆర్థిక సంవత్సరానికి గుర్తించిన పనుల జాబితాను చదివి వినిపించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గూడ సరస్వతి ప్రభాకర్ రెడ్డి , ఏపీవో బి.మురళి, ఏపీఎందేవరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీవల్లి, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది, ఉపాధి మేట్లు, కూలీలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *