వరి సస్యరక్షణలో తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా వనరుల కేంద్రం (డిఆర్సీ) వ్యవసాయాధికారి వివి శేషమ్మ రైతులకు వివరించారు. చీమకుర్తి మండలం పాటి మీద పాలెంలో శనివారం రైతు చీదర్ల కోటయ్య పాలంలో ఫార్మర్ ఫీల్డ్ నిర్వహించారు. అగ్గి తెగులు, జింక్ లోపాలకు మధ్య వ్యత్యాసాన్ని, నీటి యాజమాన్యం, ఆకుచుట్టు పురుగు,ఉల్లికోడు నివారణ చర్యల గురించి, రైతులకు వివరించి నివారణ చర్యలు తెలిపారు. విఏఏ శృతి, ఎంటీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

