ఓబిసిమోర్చా జిల్లా కోశాధికారిగా కుంచాల వేంకట శివ

రాబోవు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని సంస్థగతంగా బలీయం చేయడానికి భారతీయ జనతా పార్టీ విశేషంగా కృషి చేస్తూ యువతకు పెద్దపీట వేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్ ఆదేశానుసారం జిల్లా ఒబిసి మోర్చా అధ్యక్షులు తానికొండ సురేష్ యాదవ్ జిల్లా కమిటీని పునః వ్యవస్థీకరించారు. వానిలో భాగంగా జిల్లా కోశాధికారిగా కుంచాల వెంకట శివ కు బాధ్యతలను ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కుంచాల వెంకట శివను అభినందించారు. ఈ సందర్భంగా తానికొండ సురేష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీని ఉన్నత స్థానం చేర్చడంలో ముందుంటున్న శివ అటు పార్టీకి ఇటు కార్యకర్తలకు అనుసంధానంగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఉన్నారని ఈ బాధ్యత వీరి నిబద్ధతకు నిలువుట అద్దం లాంటిదని పేర్కొన్నారు. పార్టీ కోసం ఎల్లవేళలా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ గుర్తింపునిస్తూ ఉన్నతమైన స్థానంలో నిలుపుతుందని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తనకు బాధ్యత ఇవ్వడం పట్ల జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి, సురేష్ యాదవ్ మరియు రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాసులకు కుంచాల వెంకట శివ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *