గురునానక్ జయంతి సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అమీర్ పేట లోని గురుద్వార్ ను దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం గురుద్వార్ నిర్వహకులు మంత్రిని సన్మానించారు. మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆనం జీత్ కౌర్, సురేందర్ సింగ్, సుమిత్ తదితరులు ఉన్నారు.




