మన్నేపల్లి పంచాయితీ పరిధిలో సోమవారం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకం గ్రామ సభ సర్పంచి మంచాల వెంకటేశ్వర రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీడీఓ కెవై కీర్తి మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే పలు పనులను గుర్తించినట్లు చెప్పారు. ఆయా పనులను చదివి వినిపించారు. పనులను వివరించారు. ఎపీఓ మురళి, ఎపీఎం దేవరాజ్, టీఏలు పాల్గొన్నారు.


