రాయితీ రుణాలు వినియోగించుకోవాలి- వైఎస్సార్ కేపీ ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్

రాష్ట్ర ప్రభుత్వం అందజే స్తున్న రాయితీ రుణాలను మహిళలు సద్వినియోగంచేసుకోవాలని వైఎస్సార్ కేపీ ప్రాజెక్టు డైరెక్టర్ టి.రవికుమార్ అన్నారు. మండలంలోని మన్నేపల్లి పంచాయతీ పరిధి దారంవారిపాలెం గ్రామానికి చెందినగోగుల జయమ్మ 13 లక్షల 84 వేలతో నూతనంగాఏర్పాటు చేసిన బేకరి యూనిట్ను సోమవారంఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళలకురాష్ట్ర ప్రభుత్వం ఉన్నతి పథకం వడ్డీలేని రుణాలుమంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆశక్తి మహిళలను ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ సహాయసహకరాలుఅందజేస్తున్నాయని తెలిపారు. మూడులక్షల ఉన్నతి పథకం, పది లక్షల 80 వేలుయూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తూర్పుగంగవరం బ్రాంచి వారు రుణం మంజూరు చేయగా 35శాతం రాయితీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా వ్యాపారంపై ఆశక్తి ప్రతి ఒక్కరికి రెండు లక్షల పైన పెట్టుబడి పొందిన వారికి 35శాతం రాయితీ వర్తిస్తుందన్నారు. ఎలాంటి వ్యాపారాలు చేసుకోవాలన్నా అన్ని వర్గాల వాc ఈఅవకాశం ఉందని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చూడాల న్నారు. మీతో పాటు మరి కొంత మందికి ఇలాంటి యూనిట్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాల న్నారు. వైఎస్సార్ కేపీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు డేవిడ్, శ్రీనివాసప్రసాద్, సుబ్బారావు, దర్శి క్లస్టర్ ఏరియా కో ఆర్డినేటర్ వసుంధరాదేవి, ఏపీఎం దేవ రాజ్, సీసీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *