అన్ని వర్గాల ప్రజలకు BRS ప్రభుత్వంతోనే మేలు జరుగుతుందని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం రాత్రి బన్సీలాల్ పేట డివిజన్ లోని సున్నం బట్టీ, అరుణ్ జ్యోతి కాలనీలలో నిర్వహించిన సమావేశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నే సనత్ నగర్ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని అన్నారు. 50 సంవత్సరాల లో చేయని అభివృద్ధి ని తొమ్మిదిన్నర సంవత్సరాల లో చేశామని తెలిపారు. కాలనీ, బస్తీ అనే తేడా లేకుండా అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చడం జరిగిందని తెలిపారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, ఉచితంగా త్రాగునీటి సరఫరా చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 116 రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అంతేకాకుండా 200 రూపాయలు ఉన్న పెన్షన్ ను 2016 రూపాయల కు పెంచి వృద్ధులు, వితంతువుల గౌరవాన్ని మరింత పెంచామని చెప్పారు. మళ్ళీ BRS ప్రభుత్వం వచ్చిన వెంటనే 2016 ఉన్న పెన్షన్ ను 3016 కు పెంచి అనంతరం సంవత్సరానికి 500 రూపాయలు చొప్పున పెంచుతూ 5016 రూపాయలకు చేస్తామని వివరించారు. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యం కోసం ప్రయివేటు హాస్పిటల్స్ కు వెళ్ళి ఆర్షికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ హాస్పిటల్స్ లలో అన్ని రకాల వైద్య పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చామని, ఉచితంగా ఆపరేషన్ లు, పరీక్షలు, మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లల్ని చేర్పించాలని చెప్పారు. అన్ని విధాలుగా ప్రజలకు మేలుచేస్తున్న BRS పార్టీకి అండగా నిలబడాలని, నిత్యం మీ మధ్యనే ఉంటూ మీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న తనను కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత, BRS డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్, అరుణ్ గౌడ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.


