ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ల నిర్మాణంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం-బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయడంలో వైకాపా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21,32,432 ఇళ్లు మంజూరు చేస్తే నేటికి కేవలం 8,64,743 ఇళ్లును మాత్రమే పూర్తి చేశారని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా బిజెపి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2,46,430 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 62,886 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఈ పథకం మార్చి 2024 తో ముగిసిపోతుందని, కానీ ఇప్పటి వరకు నాలుగవ వంతు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసగిస్తూ తమ వైఫల్యాలను కప్పిపెట్టి వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసుకొంటున్నారని శివారెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా ప్రకాశం జిల్లాకు. 9568 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 6544 నిర్మాణ దశలో ఉన్నవి. ఒక లబ్దిదారునికీ గృహము కేటాయించ క పోవడం కొసమెరుపు?

కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇళ్లకు వైయస్సార్ పేరు పెట్టినందుకు సుమారు 5300 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ఆగిపోయాయని, వెంటనే కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లకు పెట్టిన బోర్డులను మార్చి పేదలకు సహకరించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాల తాకిడి ఎదుర్కోవలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని శివారెడ్డి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *