ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లులో వైఎస్సార్ సీపీ అభిమానులు అయ్యప్ప మాల ధరించి దీక్ష అనంతరం బుధవారం ఏర్పాటు చేసిన ఇరుముడి కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెం కాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డిలు హాజరయ్యారు. స్థానిక శివాలయం వద్ద మాల ధరించిన అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకు వెళ్లేందుకు ఇరుముడి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వాములను కలిసి ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పూజారి వారికి తీర్థ ప్రసా దాలు అందజేశారు. సర్పంచ్ ల సంఘ మండల మాజీ అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, బిజ్జం వెంకటరమణారెడ్డి ఉన్నారు.


