కేంద్ర ప్రభుత్వం ప్రధాని ఉజ్వల పథకం ద్వారా పేద భారతీయ మహిళలకు దేశవ్యాప్తముగా ఉచితముగా గ్యాస్ కనెక్షన్లు అందించడం జరుగుచూ ఉన్నది. వానిలో ప్రకాశం జిల్లాకు పది వేల కనెక్షన్లు మంజూరు చేయడం జరిగినది. అయినప్పటికీ సరైన ప్రచారం లేక ఆ పథకం చిట్టచివరి వరకు చేరలేదని బిజేపి ప్రకాశంజిల్లా మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు తెలిపారు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి మండలంలో పేద కుటుంబాలను గుర్తించి వారి చేత దరఖాస్తు చేయిస్తున్నారు, పెద్ద సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు కూడా ఇప్పించడం జరుగుతూ ఉన్నది. ఈ పథకానికి మరింతగా ప్రచారం తేవాలనే ఉద్దేశంతో ఒంగోలు అసెంబ్లీ పరిధిలో ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ పొందిన ప్రతి ఒక్క లబ్ధిదారుకి గ్యాస్ లైటర్ ఉచితముగా అందించాలని నిర్ణయించుకొన్నానని తెలిపారు. నవంబరు 1 తరువాత నుండి ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ పొంది ఉన్న వారు సైతం తమ గ్యాస్ కనెక్షన్ బ్యాండు తీసుకొని తనను కలువవలసినదిగా కోరారు. దూరప్రదేశంలోని లబ్ధిదారులు వాట్సప్ ద్వారా బాండు నంబరు తెలిపినచో బిజేపి కార్యకర్తల ద్వారా గ్యాస్ లైటర్ పంపిస్తామని వివరించారు. ప్రధాని ఉజ్వల 2.0 పథకం గురించి మరింత సమాచారం కొరకు 89850 55475 నంబరులో తనను సంప్రదించవలసినదిగా కోరారు.
