కర్నూల్ లో ఈనెల 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిస్ట్రిక్ క్రికెట్ చాంపియన్ షిప్ ఆధ్వర్యంలో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ అఫ్ ఇండియా సంస్థ వారు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో తాళ్లూరులోని సరస్వతీ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. అండర్-17, -15లో ద్వితీయస్థానం, అండర్-14లో తృతీయ స్థానం సాధించినట్లు తెలిపారు. వీరు రాజస్తాన్లో జరిగే రాష్ట్ర పోటీ లకు ఎంపికైన సందర్భంగా చైర్మన్ ఏవీ రమణారెడ్డి, ప్రధానోపాధ్యా యుడు శ్రీరామమూర్తి, డీన్లు వెంకారెడ్డి, రత్నం, పీఈటీ బిజ్జం వికా స్ లు విద్యార్థులను అభినందించారు.
