ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు మూడు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల రెన్యువల్స్ పెంపు అంశంపై ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గుంటూరు ఆర్జెడీ, ప్రకాశం జిల్లా ఇన్చార్జి డీఈఓ సుబ్బారావుతో చర్చించారు. జిల్లా జెడ్పీ సమావేశ మందిరంలో ఆయనతో ఈ అంశంపై చర్చించారు. ప్రవేట్ పాఠశాల లీజ్ డాక్యుమెంట్ మరో ఐదు సంవత్సరాలు ఉన్న అంశాన్ని పరిశీలించి తప్పనిసరిగా గుర్తింపు రెన్యువల్స్ చేస్తామని ఆర్ జెడీ సుబ్బారావు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిత్యం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యల పరిష్కారం విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్న ఎమ్మెల్సీల కృషిని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాలు కొనియాడుతున్నారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

