రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు మూడు సంవత్సరాల నుండి 8 సంవత్సరాల రెన్యువల్స్ పెంపు అంశంపై సానుకూల నిర్ణయానికి సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అందుకు కృషి చేసిన విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణకు, ప్రభత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డికి రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డిని కలిసి సన్మానించి ధన్యవాదాలు చెప్పారు. ఎమ్మెల్సీని వెల్లంపల్లి ఆవాస్ హోటల్ వద్ద అపుస్మా ప్రకాశం జిల్లా సంఘ నాయకులు కలిసి సన్మానించి కృతజ్ఞతలు చెప్పారు.

