సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలతో ప్రతి ఇంట్లో వెలుగులు విరజిమ్ముతున్నాయని, అందుకే జగనన్నకు మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్దంగా ఉండాలని జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తురక పాలెం పంచాయితీలో మన్నేపల్లి సొసైటీ చైర్మన్ కుమ్మిత జయ రామి రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వై నీడ్స్ ఏపీ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ కె వై కీర్తి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాలను ప్రభుత్వం అందించనదని అన్నారు. ప్రభుత్వం ద్వారా అందిన పలు సేవలను వివరించారు. సంక్షేమ లబ్ధి పట్టికను ప్రదర్శించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, మల్కాపురం, కోప్షన్ మెంబర్ కరిముల్లా, మాజీ ఎంపీటీసీ సూరా సుబ్బులు, బెల్లంకొండ వారి పాలెం, వెలుగు వారి పాలెం సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ముచ్చుమారి బ్రహ్మా రెడ్డి, మాజీ సొసైటీ ప్రసిడెంట్, ఉప సర్పంచి పులిప్రసాద్ రెడ్డి, ఎంఎల్ ఓ మల్లేశ్వర రెడ్డి, విఆర్ చంద్రశేఖర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





