తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెం గ్రా మంలో మంచి నీటి ట్యాంక్ నిర్మాణ కోసం ఎంపిక చేయాల్సిన స్థలంపై అధి కార వైఎస్ఆర్సిపి, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య వివాదం నెలకుంది. అనంతరం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది. ట్యాంక్ నిర్మాణ స్థలం ఎంపిక విషయమై గ్రామానికి చెందిన టీడీపీ నేత కొర్రపాటి రామమ్య, వైఎస్ఆర్సిపి నేత కొర్రపాటి శరత్ లు తాళ్లూరులోని టీ దుకాణం వద్ద వాదు లాడుకుని పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. సమస్య తీ వ్రం కాకుండా ఉండేందుకు ఎస్ ఐ వైవీ రమణయ్య తహసీల్దార్, ఎంపీడీవో తో కలిసి గురువారం గ్రామాన్ని సందర్శించి ఇరువర్గాలతో చర్చించారు. వివ రాల్లోకి వెళితే… కొర్రపాటి వారి పాలెం గ్రామంలో ఇంటింటికీ మంచినీటి సరఫరా నిమిత్తం రూ.70 లక్షల నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తయింది. నీటి ట్యాంక్ నిర్మాణం కోసం మూతపడిన పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలాన్ని వైసీపీ నేతలు ఎంపిక చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వివాదం తలె త్తింది. పూర్వం తమ పెద్దలు విద్యాభివృద్ధి కోసం 5 సెంట్ల స్థలాన్ని ఇ చ్చారని టీడీపీ నేతలు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థులు లేక మూతపడగా అంగన్వాడీ కేంద్రం నడుస్తోందన్నారు. పాఠ శాల ఆవరణలో ట్యాంక్ నిర్మాణం చేపట్టడం వల్ల నీరు నిల్వ ఉండి పిల్లలు ఇ బ్బందులు పడతారని, ఇక్కడున్న వేప చెట్టు నీడలో రూమ్ లు ఉన్నందున పాదచారులు సేద తీర్చుకుంటున్నారన్నారు. మరోచోట ట్యాంకును నిర్మించాలని స్థలదాతలు అభ్యంతరం తెలిపారు. పాఠశాల నిరుపయోగంగా ఉందని, ఇక్కడ నిర్మిస్తే బాగుంటుందని వైసీపీ శ్రేణులు తెలిపారు. ఈ విష యమై అధికారుల సమక్షంలోనే వాగ్వివాదం జరిగింది. ఎస్ఐ రమణయ్య ఇరువర్గాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల స్థలం కాకుండా మరో స్థలంలో నిర్మించుకోవాలని టీడీపీ శ్రేణులు చెప్తుండగా, స్థలం లేకనే ఇక్కడ కట్టేందుకు కట్టేందుకు చూస్తున్నామని వైఎస్ఆర్సిపి శ్రేణులు అధికారుల దృష్టికి తెచ్చారు. మాజీ సర్పంచ్, టీడీపీ నేత కోట నరసింహారావు మాట్లా డుతూ ట్యాంక్ నిర్మాణ స్థలంలో వివాదాలు తలెత్తకుండా తన ఇంటి వద్ద రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తానని చెప్పగా అందుకు వైఎస్ఆర్సిపి శ్రేణులు అంగీక రించలేదు. దీంతో గ్రామానికి ఎగువ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలాన్ని తన సొంత నిధులతో వారం రోజుల్లో కొనుగోలు చేసి అందజేస్తానని అధికారులకు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో స్థలాన్ని అందజేయకుంటే పాఠ శాల ఆవరణలో ట్యాంక్ నిర్మిస్తామని వైఎస్ఆర్సిపి శ్రేణులు అధికారులకు విన్న వించారు. ఇరువర్గాలు పంతాలకు పోకుండా శాంతియుతంగా అందరికీ ఇబ్బంది లేని స్థలాన్ని ఎంపిక చేసి నిర్మించుకోవాలని అధికారులు ఇరువర్గాలకు నచ్చజెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ కేవీ ప్రసాద్, ఎంపీడీవో యుగకీర్తి, ఎస్ఐ రమణయ్య, మాజీ సర్పంచ్ నరసింహారావు, మార్కెట్ క మిటీ మాజీ డైరెక్టర్లు కె.రామయ్య, కె.శరత్ లు ఉన్నారు.

