ప్రజా రంజక పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరోసారి పట్టం కడదామని తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు అన్నారు. మాధవరం గ్రామంలో శుక్రవారం సర్పంచి తాటికొండ రేణుక అధ్యక్షతన పై ఎపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో అద్భుతాలు చేసారని చెప్పారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మరింత అభివృద్ధి జరగాలన్నా మరోసారి సీఎంగా జగనన్నకు అవకాశం ఇవ్వాల్సిన ఆవశ్యతను వివరించారు. సంక్షేమ పట్టికను ఆవిష్కరించారు. ఎంపీడీఓ కె వై కీర్తి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, నాగంబొట్లపాలెం, మన్నేపల్లి సొసైటీ చైర్మన్లు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయ రామి రెడ్డి, సర్పంచిలు చిమటా సుబ్బారావు, మాజీ గుంటి గంగా ట్రస్ట్ చైర్మన కటకంశెట్టి శ్రీనివాసరావు, ఎస్సీసెల్మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం, ఎం.ఎల్.ఓ నాగ మల్లేశ్వర రెడ్డి, స్థానిక నాయకులు జయ రామి రెడ్డి, భాస్కర్ రెడ్డి, గ్రామకార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


