ఉజ్వల యోజన పథకం గ్యాస్ కనెక్షన్లను తాళ్లూరులో శుక్రవారం తహసీల్దార్ కెవీ ప్రసాద్ పంపిణీ చేసారు. ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేని బిపీఎల్ కార్డు దారులకు ఈ ఉజ్వల పథకం వర్తిస్తుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్పై కూడ రూ.300 వరకు సబ్సిడీ ఉందని చెప్పారు. అనంతరం 30 కుటుంబాలకు కనెక్షన్లు అందించారు. మంగా గ్యాస్ ఎజెన్సీనిర్వాహకులు శ్రీనివాసరావు, సిబ్బంది శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

