ప్రకాశం జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్టీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ డివిజి శంకరరావు నాలుగు రోజుల పాటు గిరిజన ప్రాంతాలలో పర్యటించి వారి జీవన స్థితి గతులు, అభివృద్ధికి అవలంభిస్తున్న పద్దతులను తెలుసుకోనున్నట్ల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాధరావు తెలిపారు. శనివారం నుండి ఈనెల 5 వరకు చైర్మన్ మార్కాపురం, దోర్నాల, యర్రగొండ పాలెం మండలాలలోని గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తారని చెప్పారు. గిరిజనులు, గిరిజన సంఘాల నాయకులు ఆయా సమావేశాలకు హాజరై తమ సమస్యలను తెలుపుకోవచ్చని చెప్పారు. 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి 7గంటల వరకు మార్కాపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో అందు బాటులో ఉంటారని చెప్పారు. గిరిజన సంఘాల నాయకులు, గిరిజనుల తమ విన్నపాలు తెలుపుకోవాలని చెప్పారు. చైర్మన్ పర్యటనకు సంబంధించిన షేడ్యూల్ ను వివరించారు.

