ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ గిరిజన యువతీ యువకులను తిరుపతి పట్టణంలోని ప్రముఖ కోచింగ్ కేంద్రంలో గ్రూప్-2లో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆశాఖ జిల్లా సంక్షేమ అధికారి పి జగన్నాధరావు తెలిపారు. జిల్లాలో ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన యువతీ యువకులు ఈనెల 5వ లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కోచింగ్ సమయంలో ఉచిత వసతి బోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హత, కుల దృవీకరణ, ఆధార్ జెరాక్స్ పత్రాలు జత పరచి దరఖాస్తులను జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి కార్యాలయానికి చేర్చాలని చెప్పారు. పూర్తి వివరాలకు బాలాజీ, వైటీసీ సెంటర్ మెనేజర్, ఫోన్ నెంబర్ 8187899877 ను సంప్రదించాలని కోరారు.
