2021-22 సంవత్సర దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల సాధారణ మెరిట్ జాబితాపై అభ్యంతరాలను పూర్తి ఆధారాలతో తెలిపాలని విభిన్న ప్రతిభా వంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన తెలిపారు. ప్రత్యేక ఉద్యోగాల నియామక ప్రక్రియలో బాగంగా అభ్యంతరాల స్వీకణార్థం గ్రూప్-4 మరియు క్లాసు -4 పోస్టుల సాధారణ మెరిట్ జాబితాను అభ్యర్థుల పరిశీనార్థం వెబ్ సైట్ www.prakasam.ap.gov.in/notices tab లో రిక్రూట్మెంట్ నందు ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులు వెబ్ సైట్ను ఈనెల 2వ తేది నుండి 8వ తేదీ లోపు పరిశీలించి అభ్యంతరాలు ఉన్నట్లయితే పూర్తి ఆధారాలతో నిర్ణీత సమయంలో తెలియజెయ్యాలని కోరారు. సందేహ నివృత్తి కోసం 08592-281310నంబర్ను కార్యాలయ పనివేళల్లో సంప్రదించాలని వివరించారు
బ్యాక్ లాగ్ పోస్టుల సాధారణ మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ – వారం రోజుల లోపల తెలిపాలి – విభిన్న ప్రతిభా వంతులు, హిజ్రాలు మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు జి అర్చన
02
Dec