మిచౌంగ్” తుఫాన్ నేపథ్యంలో4, 5 తేదీల్లో స్కూళ్లకు సెలవు -ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు- పంటల నష్ట నివారణకు కృషి- కలెక్టర్ ఏఎస్.దినేష్ కుమార్

‘మిచౌంగ్’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 4, 5 తేదీలలో సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ దినేష్కుమార్ తెలిపారు. నాలుగో తేదీ అర్ధరాత్రి నుంచి ఐదో తేదీ మధ్యాహ్నం వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచిం చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో 24 గంటలూ పనిచేసేలా 1077 నెంబరుతో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉద్యోగులెవరికీ సెలవులు ఇవ్వకుండా. యంత్రాంగం మొత్తాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. ఈ తుఫాను ప్రభావం, వివిధ జిల్లాలలోని పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి శని వారం కోస్తా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవనం నుంచి కలెక్టర్, సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగం సన్నద్ధమైన తీరును ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి కలె క్టర్ వివరించారు. అనంతరం వివరాలను కలె క్టర్ మీడియాకు మధ్య ఈ నెల 5వ తేదీన తీరం దాటే అవకాశం ఉందనివాతావరణ శాఖ తెలిపిందన్నారు. తీరాన్ని దాటే
సమయంలో గంటలకు 90-105 కిలో మీటర్ల వేగంతో
గాలులు వీస్తాయని హెచ్చరించటంతో రవాణా, విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సంబంధిత శాఖలను అప్రమత్తం చేశామన్నారు. అవసరమైన ప్రొక్లెయిన్లను అందుబాటులో ఉంచామన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా నీటి ట్యాంకులను ముందస్తుగానేనింపి పెట్టుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.
తుఫాన్తో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా
చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *