ముందున్న కాలం బిసీలదే….తానికొండ సురేష్ యాదవ్

రాబోయే రోజులన్నీ బీసీలవే అని, రాష్ట్రం మొత్తంలో బీసీ జనాభా అత్యధికమని కాబట్టి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాబోయే ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలు పొందడం ఖాయమని పివి శివారెడ్డి పేర్కొన్నారు. బీసీ ప్రధానిగా నరేంద్ర మోదీ బీసీల అభివృద్ధికి చేతివృత్తుల పనివారమునకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వివిధ రకాలైన పథకాలను ప్రవేశపెట్టి బీసీలను ఆర్థికంగా సామాజికపరంగా అభివృద్ధి చెందేలా చూస్తున్నారని బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి పేర్కొన్నారు.
బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుల తానికొండ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన ఒబిసీ మోర్చా పదాదికారుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పివి శివారెడ్డి మరియు రాష్ట్ర ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన సురేష్ యాదవ్ మాట్లాడుతూ మండల కమిటీల నిర్మాణం చేసి, ప్రతి మండలం నుండి బిజెపి బలపడటానికి కృషి చేయాలని కార్యకర్తలను కోరారు. రాబోవు రోజుల్లో బీసీ లందరూ బలమైన శక్తిగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కు కృషిచేసి బీసీని ముఖ్యమంత్రి గా చేసే విధంగా, ఆ దిశగా అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివరించి వాటిని బిసి లబ్ధిదారులకు అందే విధంగా చూడాలని సూచించారు.
అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవులు నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ కేంద్ర పథకాలను పదాధికారులకు వివరించి వారికి కమిటీలు శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయుటకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశములో ఓ బి సి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల నాగేంద్ర యాదవ్, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, బిజెపి జిల్లా కార్యదర్శి బసినేపల్లి రాజశేఖర్ మరియు ఓబీసీ మోర్చా జిల్లా పదాధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *