“దివ్యాంగుల సేవ” లో వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్.- దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావం తొలగించుకొని ముందడుగు వేయాలి.”- వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ అధ్యక్షులు చీదెళ్ల వేంకట ప్రసాద్

ప్రతి వ్యక్తి తమలో తాము శోధన చేసుకోవాలని భగవంతుని సృష్టిలో ఏదైనా అవయవము లుప్తమైనప్పుడు ఆత్మ న్యూనత భావము తొలగించుకొని దృఢ మనస్కులై మిగతా అవయవాలతో సకలాంగులకు ఏమాత్రము తీసిపోని రీతిలో… దివ్యాంగులు సమాజంలో తమ ముద్రను వేయాలని, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన రంగంలో రాణిస్తూ అద్భుతమైన విజయాలు సాధించాలని, స్ఫూర్తివంతమవ్వాలని వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ అధ్యక్షులు చీదెళ్ల వేంకట ప్రసాద్ పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డిసెంబరు 3వ తేది అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక సంతపేటలోని ప్రభుత్వ వికలాంగుల బాలుర వసతి గృహము నందు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు చీదెళ్ల వేంకట ప్రసాద్ అధ్యక్షతన సేవా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వికలాంగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్స్ ను బహుకరించారు. వారి లో మనోధైర్యాన్ని నింపే విధంగా క్లబ్ అధికారులు సందేశం ఇచ్చారు. గతంలో కూడా దివ్యాంగుల సేవలో వాసవి క్లబ్ ఎన్నో సేవలను నిర్వహించాయని ఉదయాస్తున్న సేవలు ప్రపంచ వికలాంగుల దినోత్సవం తదితర కార్యక్రమాలలో వికలాంగులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందించడం జరిగిందని తెలిపారు.

కార్యక్రమంలో వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ అధ్యక్షులు చీదెళ్ల వేంకట ప్రసాదు, కార్యదర్శి యేల్చూరి నగేష్ గుప్తా, కోశాధికారి భూమా శ్రీనివాసులు, రీజన్ చైర్మన్ దర్శి చంద్రశేఖర్, జోన్ చైర్మన్ చలువాది సత్యనారాయణ, క్లబ్ పూర్వ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం, నేరెళ్ల శ్రీనివాసరావు, భూమా పవన్ సత్యకుమార్ మరియు దివ్యాంగుల వసతిగృహం జూ. అసిస్టెంట్ గంటా రాంబాబు, విద్యార్ధులు సోమవారపు స్టీఫెన్, వినుకొండ సంతోష్, కత్తుల పాండు రంగస్వామి, రామదుర్గం బాల వేంకటేశ్వర్లు, కట్టా దయాకర్, యామర్తి రాజా, సోమేపల్లి హేమంత్, వంట మనిషి రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *