నాలుగు రాష్ట్రాలలో ఆదివారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో మంచి ఫలితాలు సాధించినందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. చర్చిసెంటర్, పలు చోట్ల స్వీట్లు పంపిణీ చేసారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ ఘడ్లలో విజయం, తెలంగాణ ఎన్నికలలో మంచి ఓటింగ్ శాతం సంపాదించటంపై హర్షం వ్యక్తం చేసారు. స్వీట్లు పంపిణీ చేసారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో భారత దేశంలో 350 సీట్లకు పైగా సాధించి మరోసారి ప్రధాన నరేంద్రమోదీ ప్రధానికావటం ఖాయమని అన్నారు. ఒంగోలు పార్లమెంటు పార్టీ అధ్యక్షుడు పీవీ శివా రెడ్డి, సిగ్గం శ్రీనివాసరావు, తోగంటి శ్రీనివాస్, అధికార ప్రతినిథి బొద్దులూరి ఆంజనేయులు, శివాజి, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.


