శ్రీ హర్షిణీ విద్యాసంస్థల ఆధ్వర్యంలో సివిల్స్ అవగాహన సదస్సు నిర్వహణ- CSB IAS అకాడమీ డైరెక్టర్ బాలలత

ఒంగోలులోని శ్రీ హర్షిణీ విద్యాసంస్థ లో ఆదివారం IAS ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కొరకు హైదరాబాదు లోని CSB IAS అకాడమీ డైరెక్టర్ బాలలత ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగినది.
అవగాహన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి బాలలత మాట్లాడుతూ…. విద్యార్థులు డిగ్రీ స్థాయి నుండి సివిల్స్ పై అవగాహన పెంచుకొని మొదటి సంవత్సరం నుండి ప్రతిరోజు న్యూస్ పేపరు చదువుచు కరెంట్ అఫైర్స్ విషయాల మీద నోట్స్ తయారు చేసుకొనే విధానాన్ని తెలియజేశారు, అదేవిధంగాNCERT టెక్స్ట్ బుక్స్ ఎలా చదవాలి… .. అనే విషయం మీద అవగాహన కల్పించారు, విద్యార్థులు ఇప్పటినుండే ప్రణాళిక బద్ధంగా కష్టపడి ఇష్టంతో చదివితే కచ్చితంగా IAS సాధించవచ్చు అని తెలియజేశారు . విద్యార్థులు కు IAS పరీక్ష పై ఉన్న అనుమానాలను , అపోహలను నివృత్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ …. డిగ్రీ స్థాయి నుండి మన ఒంగోలు విద్యార్థులకు సివిల్స్ పరీక్షలలో విజయం సాధించే దిశగా డిగ్రీ మొదటి సంవత్సరం నుండే శ్రీ హర్షిణీ IAS అకాడమీలో శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు . ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు, అధ్యాపకులు ఇస్మాయిల్ , రాజశేఖర్ , రవీంద్ర , AO ర్యాంకర్ శ్రీనివాసరావు, గిరీష్ ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *