దర్శి లో అమర గాయకుడు ఘంటసాల కు ఘన నివాళి

ప్రపంచం ఉన్నంత వరకు తెలుగు గాయకులుగా ఘంటసాల వెంకటేశ్వరరావు మరచి పోలేని అమర గాయకునిగా ఉంటారని తహశీల్దార్ వెంకటేశ్వ రరావు కొనియాడారు. దర్శి రెవెన్యూ కార్యాలయం ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతిని సంఘ సేవకుడు జీవీ రత్నం అధ్యక్షతన సోమవారం జరిగింది. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. తహశీల్దార్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ …ఘంటసాల ఆలపించిన గీతాల రూపంలో నేటికీ ఆయన ప్రజల మన సుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. ప్రముఖ సంఘ సేవకులు నేషనల్ అవార్డు గ్రహీత జీవి రత్నం మాట్లాడుతూ ప్రపంచంలో మధుర గాయకుడిగా స్వాతంత్ర సమరయోధులుగా రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మహానీయుడు ఘంటసాల వెంకటేశ్వరరావు వారికి భారతరత్న అవార్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం కృషితో ప్రకటించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . డీటీ రవిశంకర్, రాష్ట్ర దళిత సేన దర్శి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి గర్నెపూడి ప్రేమ్ కుమార్, తలారి దేవప్రసాద్, రాచపూడి మోషే, రవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *