మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తాళ్లూరు మండలంలో వాగులు పొంగే సమయంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ వైవీ రమణయ్య అన్నారు. మండలంలోని దోర్నపువాగును ఆయన సిబ్బందితో కలిసి సోమవారం పరిశీలించారు. మండలంలో ప్రమాదక రంగా ప్రవహించే వాగు కావడంతో అక్కడ రెండు వైపులా పలువురు సిబ్బందిని పహారా పెట్టారు. వాగు ఉధృతి పెరిగితే ఎట్టి పరిస్థితుల్లో వాహనదారు లను అనుమతించవద్దని సూచించారు. వాహ నాలను దారి మళ్లించేందుకు అవసరమైన చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచించారు. ప్రధాన వాగులను గుర్తించి ఆయా మార్గాల్లో సిబ్బం దిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఆయన వెంట ఏఎస్ఐ మోహనరావు, సిబ్బంది ఉన్నారు.
