జడివాన – మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సోమవారం 534.6 మి.మీల నమోదు 27 మండలాలో వర్షపాతం నమోదు

మిచాంగ్ తుఫాన్ కలవర పెడుతోంది. ఇప్పటికే జిల్లాలో వర్ష ప్రభావం కనిపిస్తోంది. మరో రెండు రోజుల పాటు తీవ్ర వర్షాలు, ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో వరి కోత దశకు వచ్చిన దశలో వానలు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతుండగా, ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులు, పశ్చిమ ప్రాంత రైతాంగం మాత్రం వర్షకోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో సోమవారం 536.6 మి.మీల వర్షపాతం నమోదు అయినట్లు ఎఎస్ శైలజ తెలిపారు. గత రెండు రోజులలో 641.2 మి.మీలు వర్షపాతం నమోదు అయినది. జిల్లాలో సోమవారం 38 మండలాలకు గాను 27 మండలాలలో వర్షపాతం నమోదు అయినది. అందులో కొత్తపట్నం మండలంలో 95.4 మి.మీలు, టంగుటూరులో 62.2, ఎస్ కొండలో 49.8, జరుగుమల్లిలో 49.0, ఒంగోలు 33.8, కొండేపి, పొన్నలూరులలో 30.4, ఎస్ఎన్ పాడులో 25.0, మద్దిపాడులో 21.8, ఎన్2 పాడు 21.2, పీసీ పల్లి 17.4, చీమకుర్తి 16.2, సీఎస్ పురం 13.8, వెలిగండ్ల 9.6, తాళ్లూరు 8.6, ముండ్లమూరు 8.4, మర్రిపూడి 8.2, పామూరు 7.6, కనిగిరి 7.4, కొమరోలు 5.2, హెచ్ఎం పాడు 3.6, కురిచేడు 2.8, పుల్లల చెరువు 1.6, దర్శి, రాచర్లలలో 1.4, మార్కాపురం, కంభంలలో 1.2 మి.మీల వర్షపాతం నమోదు అయినది.
పలు మండలాలలో పర్యటించిన జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు… జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు మద్దిపాడు, తాళ్లూరు, ఎస్ఎన్ పాడు మండలాలలో పర్యటించారు. వరి, మొక్కజొన్న, ప్రత్తి, పొగాకు, మిరప పంటలను పరిశీలించి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. తాళ్లూరు వ్యవసాయాధికారి ప్రసాదరావు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *