భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమ సమాజ స్వాప్నికుడు, రాజ్యాంగ నిర్మాత, దళితబహుజన వర్గా ఆశాజ్యోతిగా భారతీయ జనతాపార్టి జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి కీర్తించారు.బుధవారం ఒంగోలు బిజేపి అసెంబ్లీ ఇన్చార్జి వైసి యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా స్థానిక హెచ్ సి ఎం స్కూల్ వద్ద గల బాబా సాహెబ్ విగ్రహానికి పూలమాలాంకృతం చేసి జోహార్లు అర్పించారు. అనంతరం శివారెడ్డి మాట్లాడుతూ డా. అంబేడ్కర్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి తొలి న్యాయశాఖ మంత్రిగా స్వాతంత్ర్య అనంతరం భారతదేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి సమసమాజ నిర్మాణానికి మార్గం సుగమము చేశారని శ్లాంఘించారు. యోగయ్య యాదవ్ మాట్లాడుతు … దేశంలోని బడుగు బలహీన వర్గ ప్రజలకు సత్వర న్యాయం అందేలా, దేశంలో అంటరానితనం రూపుమాపేలా విశేషమైన కృషిచేశారని, రిజర్వేషన్ ప్రకటించి అందరూ ఉన్నతంగా ఎదిగేలా కృషిచేసిన మహోన్నతులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పేముల మోజీ, నన్నేపోగు సుబ్బారావు, శివాజీయాదవ్, మధు యాదవ్, జువ్విగుంట కోటేశ్వరి, సెగ్గం శ్రీనివాసరావు, పువ్వడ దామోదర్, కటా రాధా కృష్ణ, శిరీష్, మిరియం శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

