ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. అభ్యుదయ వాది, సీనియర్ ఉపాధ్యాయుడు అట్లూరి రామారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి. రవిబాబు మాట్లాడుతూ విశ్వజ్ఞాని ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు రాజ్యాంగంలో అనేక చట్టాలను చేర్చి మహిళలకు విద్య, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు అనేక అర్హతలు కల్పించారని అన్నారు. ఆయన జీవిత చరిత్రను విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకుని నడుచుకోవాలని కోరారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అభ్యుదయ వాది అట్లూరి రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శమని జీవిత చరిత్రపై కవితలు వినిపించారు. అంబేద్కర్ యూత్ రాయవరపు ఏడుకొండలు ఆధ్వర్యంలో విద్యార్థులు మిఠాయిలు, పులిహోర పంపిణీ చేసారు. ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఐ. వెంకటేశ్వర్లు, నాగార్జున, ఆంజనేయులు, అంబేద్కర్ యూత్ సభ్యులు రాయిపూడి శ్రీను, కటికల శ్రీను, రామకోటయ్యలు పాల్గొన్నారు.

