ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తాళ్లూరు వికే జూనియర్ కళాశాలలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి కళాశాల ప్రిన్సిపాల్, లెక్చరర్లు, విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. పిన్సిపాల్ కె ఆంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. పిన్సిపాల్ కె ఆంజనేయులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కొరకు రాజ్యాంగంలో అనేక చట్టాలను చేర్చి మహిళలకు విద్య, సామాజికంగా, రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు అనేక అర్హతలు కల్పించారని, ఆయన జీవిత చరిత్రను వివరించారు. కార్యక్రమంలో లెక్చరర్లు వై గురవయ్య (సివిక్స్), ఎస్ లతితబోస్ (ఇంగ్లీషు), పార్వతీ భాయ్ (ఎకనామిక్స్), టి లక్ష్మయ్య (వోకేషనల్) అధ్యాపకేతర సిబ్బంది ఎం బ్రహ్మానంద రెడ్డి, బి వెంకటేశ్వర్లు, కె శ్రీనివాసరావు, సీహెచ్ జయపాల్ రావు, ఎ శ్యాంసన్, ఎస్ సుబ్బరామయ్య లు పాల్గొన్నారు.
