డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావితరాలు ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిఆర్ అంబేడ్కర్ 67వ వర్ధంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్కుమార్, మేయర్ గంగాడ సుజాతలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హెచ్సీఎం జూనియర్ కళాశాల, కోలాస్ హోటల్ ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ… భారతరత్న, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆశయాలను కొనసాగించటమే 1 ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ రంగంతో పాటు విద్య, ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పించిన వారి అభ్యున్నతికి కృషి చేసారని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ స్పూర్తితో యువత విద్య అనే ఆయుధంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ… బడుగు, బలహీన వర్గాల వారికి ఓటు హక్కు లేకుండా చేసిన రోజుల నుంచి రాజ్యాధికారం చేతికందించే రోజుల వరకు మార్చు వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఫలితమేనని చెప్పారు. లంజన్ మ్యూజియంలో అంబేద్కర్ బంగారు విగ్రహం, అమెరికన్ పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని పెట్టి గౌరవించారని చెప్పారు. అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినదరి ఆశయాలను కొనసాగిండానికి నడుం బిగించినట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి లక్ష్మానాయక్, బిసీ సంక్షేమ అధికారి అంజలి, బిసీ కార్పోరేషన్ ఈడీ ధనలక్ష్మి, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ అర్జున్ నాయక్, డిటర్ఏ పీడి రవికుమార్, డిటిసి ఆర్ సుశీల, మాజీ ఎమ్మెల్యే ఆదేన్న దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రం, చప్పిడి వెంకటరావు, బిళ్లా చెన్నయ్య. టి అనంద్ మాదిగ, పట్రా బంగారం, దాసరి శివాజీ తదితరులు పాల్గొన్నారు.


