కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ ఒంగోలు అసెంబ్లీ కన్వినర్ యోగయ్య యాదవ్ అన్నారు. సర్వేరెడ్డిలెంలో గురువారం వికజిత్ భారత్ సంకల్పయాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న యోగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం కోవిడ్ను సమర్ధవంతంగా ఎదుర్కోని ప్రపంచంలో అజేయశక్తిగా నిలవటంపై ప్రధాన మోదీ సేవలను కొనియాడారు. పేద, బడుగు వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను వివరించారు. కార్యక్రమంలో పార్లమెంటు కన్వినర్ సెగ్గం శ్రీనివాసరావు, అధికార ప్రతినిథి బొద్దిలూరి ఆంజనేయులు, ఒబిసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు సుధాకర్ యాదవ్, మూడవ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.
