సనత్ నగర్ లోని జాఫ్రీ మసీద్ కమిటీ అధ్యక్షులు నోమాన్ ను మాజీమంత్రి, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నోమాన్ తల్లి, మాజీ అధ్యక్షుడు సిరాజుద్దీన్ భార్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతు మరణించారు. విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం సనత్ నగర్ లోని SRT లో గల వారి నివాసానికి వెళ్లి నోమాన్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంట BRS పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలను బాల్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ పి. శేఖర్, మాజీ అధ్యక్షుడు ఖలీల్, నాయకులు పాజిల్, కరీం, జమీర్, రఫిక్ తదితరులు ఉన్నారు.




