ఒంగోలులో అత్యాధునిక లాండ్రీ వాష్ “సూపర్ డ్రై” ఆదివారం ఘనంగా ప్రారంభించారు. కార్యాక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, అద్దంకి నియోజక వర్గ ఇన్చార్జి బాచిన క్రిష్ణ చైతన్య, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ వైవీ భద్రా రెడ్డి, అద్దంకి పరిశీలకులు మారం వెంకట రెడ్డి, తాళ్లూరు వైసీపి ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్రలు పాల్గొని పలు విభాగాలు ప్రారంభించారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ డ్రై ప్రజల అదరాభిమానాలు పొందాలని దీవించారు. ముందుగా శనివారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పలు విభాగాలు పరిశీలించి ఎంపీపీ తాటికొండను దీవేనలు అందించారు. తాళ్లూరు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, జెడ్పీటీసీ మెట్టు వెంకట రెడ్డి, దర్శి ఎఎంసీ చైర్మన్ మిల్లర్ బుజ్జి, దర్శి, ముండ్లమూరు ఎంపీపీలు జీఎస్ అచ్చయ్య, ఎస్ఎస్ బ్రహ్మానంద రెడ్డి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూధన రెడ్డి, సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఎవీ రమణా రెడ్డి, వైస్ ఎంపీపీ ఎంఎన్నీ నాగార్జున రెడ్డి, దర్శి, తాళ్లూరు వైసీపీ మండల అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్), టీవీ సుబ్బారెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, దారం వాసు దేవ రెడ్డి, ఫిషరీస్ డైరెక్టర్ షేక్ సైదా, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లాసొసైటీచైర్మన్ యాడిక యలమందా రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ పులి ప్రసాద్ రెడ్డి, నాగంబొట్ల పాలెం సర్పంచి చిమటా సుబ్బారావు, బి కే వి పాలెం సర్పంచ్ పిఎస్ శ్రీకాంత్ రెడ్డి, పలు మండలాల జెసీఎస్ కన్వినర్లు వెంకటేశ్వర్లు, జయంతి, పలు దేవాలయాల మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, పులి బ్రహ్మా రెడ్డి, వెలుగువారిపాలెం సర్పంచి బ్రహ్మా రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, ఎంపీటీసీలు, పలు మండలాల నుండి అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిథులు పాల్గొన్నారు. తాళ్లూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ కళ్యాణ్ లు అతిథులకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం నిర్వహించారు.

















