ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో ఆదివారం గంగా పర్వత వర్ధని సోమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక వన భోజనాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉసిరి వనంలో వన బోజనాలు స్వీకరించారు. ఆలయ పూజారులు నుదురు పాటి రమణయ్య, ఉద్దండం రమణయ్యలు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వన భోజనాలు స్వీకరించారు.


