ప్రజలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేరు చెబితే చాలు మంచి స్పందన వస్తుందని భారతీయ జనత పార్టీ ఒంగోలు కన్వినర్ వైసీ యోగయ్య యాదవ్ అన్నారు. ఒంగోలు మండలం బిజేపి ఆధ్వర్యంలో ఉలిచి, బొద్దులూరి వారి పాలెం గ్రామాలలో ఆదివారం వికజిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు కన్వినర్ వైసీ యోగయ్య యాదవ్ మాట్లాడుతూ వికసిత్ భారత్తో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేస్తున్నట్లు చెప్పారు. రాబోవు సార్వత్రిక లోకసభ ఎన్నికలలో బిజేపి 350 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులతో పాటు పార్టీ పార్లమెంటు కన్వినర్ సెగ్గమ్ శ్రీనివాస రావు, అధికార ప్రతినిథి బొద్దిలూరి ఆంజనేయులు, మిరియం శ్రీనివాసరావు యాదవ్, బి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


